సాక్షి, హైదరాబాద్: 'దయచేసి నా సీటు మార్చండి. ప్రతిపక్ష నాయకుడే వచ్చి నా దగ్గర నిలబడితే ఏమి మాట్లాడగలను' అంటూ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి చేసిన వ్యాఖ్యలతో ఆంధ్రప్రదేశ్ శాసన సభలో నవ్వులు విసిరాయి. విద్యుత్ రంగంపై టీడీపీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సమాధానం ఇస్తుండగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు అడ్డుతగిలారు. ఈ సందర్భంగా రామనారాయణరెడ్డి స్పందించారు.అరాచక శక్తులంటూ అధికార పార్టీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించడం సమంజసం కాదని అన్నారు. ఆ పదం గౌరవప్రదం కాదని, ఆ పదాన్ని చంద్రబాబు ఉపసంహరించుకుంటే గౌరవప్రదంగా ఉంటుందని హితవు పలికారు. ఒకవేళ చంద్రబాబు ఉపసంహరించుకోకపోతే ఈ పదాన్ని రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్‌ను ఆనం కోరారు. తన సీటు మార్చాలని, ప్రతిపక్ష నేతే తన పక్కన నిలబడితే తానెలా మాట్లాడగలనని రామానారాయణ అన్న మాటతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నవ్వేశారు. అధికా పార్టీ సభ్యులు కూడా నవ్వులు చిందించారు. రామనారాయణరెడ్డి సూచనతో అరాచక శక్తులు అనే పదాన్ని తొలగిస్తున్నట్టు స్పీకర్ సీతారాం ప్రకటించారు.
ఆయన నా పక్కనా.. జరిగే పనేనా?